Single: యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. దర్శకుడు కార్తిక్ రాజు రూపొందించిన ఈ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
శ్రీవిష్ణు మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఫుల్ ఫన్ రైడ్‌ను అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాలుగా నిర్ణయించారు.
Also Read: Trump: ట్రంప్ సంచలనం: సినిమా పరిశ్రమకు బిగ్ షాక్!
ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మే 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘సింగిల్’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతోంది. శ్రీవిష్ణు ఫ్యాన్స్‌తో పాటు కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ పర్ఫెక్ట్ వినోద ప్యాకేజీ కానుంది. మరి, ఈ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
సింగిల్ ట్రైలర్ :