Spirit: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ పవర్‌ఫుల్ కాప్ స్టోరీలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పే వినూత్నమైన రోల్ అని తెలుస్తోంది.
సందీప్ వంగా అనుష్కను ఈ పాత్రకు ఎంచుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత సిట్టింగ్స్ పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్
Spirit: టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథాంశం సందీప్ వంగా మార్క్‌తో పాటు ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకోనుందని సమాచారం. అనుష్క-ప్రభాస్ కెమిస్ట్రీ, సందీప్ వంగా విజన్‌తో ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.