Pushpa 2

Pushpa 2: ‘పుష్ప-2’ గురించి అక్కడ సిద్ధార్థ్… ఇక్కడ రాజేంద్ర ప్రసాద్!

Pushpa 2: ‘పుష్ప-2’ సినిమాను ఉత్తర భారతీయులు నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ‘పుష్ప’ మాదిరిగానే ఈ లేటెస్ట్ మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది బయ్యర్స్ కు నష్టాన్ని కలిగించే ఆస్కారం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హీట్ ను పెంచుతున్నాయి. సోమవారం ‘హరికథ’ ప్రెస్ మీట్ లో ఈ మధ్య వస్తున్న సినిమాలను గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ మధ్య ఎర్రచందనం దొంగ కథను సినిమాగా తీశారు… వాడొక హీరో’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

Pushpa 2: అలానే ‘మిస్ యూ’ మూవీతో శుక్రవారం జనం ముందుకు రాబోతున్న తమిళ హీరో సిద్ధార్థ్ మరోసారి ‘పుష్ప-2’ మూవీపై తన అక్కసును వెళ్ళగక్కాడు. పాట్నాలో ‘పుష్ప-2’ ఈవెంట్ కు జనం రావడం మార్కెటింగ్ స్టంట్ అని అన్నాడు. జేసీబీ వచ్చిన జనాలు చూడటానికి వస్తారని, దానిని పట్టించుకోనవసరం లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ వర్షన్ ఐదు రోజుల్లో 339 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: ఈ రాశి వారు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *