Aadi Saikumar: సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ పుట్టిన రోజు డిసెంబర్ 23. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆది సాయికుమార్ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. ఇందులో ‘షణ్ముఖ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలానే ‘శంబాల’ మూవీ సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ఆది పాల్గొంటున్నారు. దీనితో పాటే ఈటీవీ విన్ కోసం ఆయన ‘సబ్ – ఇన్ స్పెక్టర్ యుగంధర్’ అనే మూవీ చేస్తున్నారు. ఇవి కాకుండా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే సినిమాలోనూ ఆది నటిస్తున్నారు.