Kubera

Kubera: కుబేరతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శేఖర్ కమ్ముల!

Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్‌లో ఒక్కో ఫ్రేమ్ అద్భుతంగా, శక్తివంతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌కు మరో స్థాయిని అందించింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న పాత్రల పరిచయంతో పాటు, జిమ్ సరభ్ నెగెటివ్ షేడ్‌లో చెప్పిన ‘నాది నాదే ఈ లోకమంతా’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ధనుష్ పాత్రలోని ‘కన్ను నాది, కలలు నావి’ అంటూ సాగే సంభాషణలు కథలోని లోతును సూచిస్తున్నాయి.

Also Read: Sandeep Reddy Vanga: స్పిరిట్ స్టోరీ లీక్ చేసిన దీపికా.. కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్‌ రెడ్డి వంగా సంచలన ట్వీట్

Kubera: సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున బలమైన పాత్రలో కనిపిస్తుండగా, ధనుష్ దరిద్రంతో పోరాడే పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. రష్మిక పాత్ర రహస్యంగా ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా, ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా శేఖర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ‘కుబేర’తో శేఖర్ కమ్ముల సినీ సంచలనం సృష్టించడం ఖాయమని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

కుబేర సాంగ్ లిరికల్ వీడియో :

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kubera: ‘కుబేర’ సక్సెస్‌తో ధనుష్ హ్యాట్రిక్‌కు సిద్ధం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *