Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2,996 వార్డులకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. తాజాగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన (Scrutiny) ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
నామినేషన్ల పరిశీలన తర్వాత ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి మరియు స్వతంత్రులుగా మొత్తం 19,608 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మరికొన్ని ముఖ్యమైన దశలు మిగిలి ఉన్నాయి. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Prabhas: మరోసారి ప్రభాస్-మారుతి కాంబోపై.. పీఆర్ టీమ్ క్లారిటీ!
-
తుది జాబితా: రేపు (ఫిబ్రవరి 3) సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
-
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11న ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది.
-
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు విజేతలను ప్రకటిస్తారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల బలాబలాలను అంచనా వేస్తూ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి.
