Tirupati

Tirupati: అపచారం.. అన్నమయ్య విగ్రహానికి ”శాంటాక్లాజ్‌ టోపీ”

Tirupati: తిరుమల అన్నమయ్యా సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం శాంతాక్లాజ్‌ టోపీ పెట్టారు. మంగళవారం ఉదయం బజరంగ్‌దళ్‌ సభ్యులు ఈస్ట్ పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపైనా హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులు సీసీటీవీ వీడియో చూడగా ఒక్క బిచ్చగాడు తన భుజానికి శాంతాక్లాజ్ వేసుకున్నట్టు సంచి వేసుకొని విగ్రహం చుట్టు కొన్నిసార్లు తిరిగి ఎవరు చూడడంలేదు అని నిర్ధారించుకొని ఇనుప గేటు పై నుండి లోపలి వెళ్లి శాంతాక్లాజ్ టోపి పెట్టి మల్లి తిరిగి వచ్చాడు. ఇదంతా సిసిటీవీ వీడియోలో రికార్డయ్యింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు.. వెండి మాత్రం ఈరోజు ఇలా..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

AP SSC Exam Fees: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును మరోసారి పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం పాఠశాల విద్యాశాఖ తత్కాల్‌ పథకం కింద ఫీజు గడువును పెంచింది. ఫీజు చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 27 నుండి తమ పాఠశాలోలే ఫీజు చెలించవొచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో 2024-2025 10th ఎగ్జామ్స్ మార్చి లో జరగనున్నాయి. పబ్లిక్ ఎక్సమ్ కి సంబందించిన ఫీజు గడువులని పొడగిస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తరువులు విడుదల చేసింది. ఇప్పటికే పలుమార్లు పదోతరగతి పబ్లిక్‌ ఎక్సమ్ ఫీజు గడువును పెంచుకుంటూ వచ్చింది. మల్లి ఇంకో సారి పాఠశాల విద్యాశాఖ తత్కాల్‌ పథకం కింద ఫీజు గడువు పొడిగిస్తూ నాటు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదల ప్రకారం రూ.వెయ్యి ఫీజుతో డిసెంబర్‌ 27 నుంచి జనవరి 10 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు కట్టిన ఫీజుని ఆన్‌లైన్‌లో చెల్లించాలి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంకా ప్రిన్సిపాళ్లు సూచించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *