Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’ ఈ నెల 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను రూపొందించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ కూడా ఈ మూవీపై హైప్‌ను మరింత పెంచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఇదిలా ఉంటే, సల్మాన్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈసారి కూడా ఒక సౌత్ డైరెక్టర్‌తో సల్మాన్ కలిసి పనిచేయనున్నట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఇటీవల సల్మాన్‌ను కలిసి ఒక కథాంశాన్ని వినిపించినట్లు తెలుస్తోంది.సల్మాన్‌కు ఈ కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేసేందుకు సల్మాన్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ‘అమరన్’ దర్శకుడికి నిజంగా సల్మాన్ అవకాశం ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ‘సికందర్’ సినిమాలో సల్మాన్ సరసన అందాల తార రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది.
