మలయాళ బ్యూటీ సాయిపల్లవి, స్టార్ హీరో శివ కార్తీకేయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అమరన్. రాజ్ కుమార్ పబెరియసామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. దీపావళి కానుకగా రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
కాగా తాజాగా కేరళలో జరిగిన మూవీ ప్రమోషన్స్ లో ఓ అభిమాని అత్యుత్సాహం చూపించాడు. సాయిపల్లవిని సెల్ఫీ ఇవ్వాలని కోరగా అందుకు ఆమె ఒప్పుకుంది. ఆ అభిమాని వద్దకు వస్తున్న క్రమంలోనే అతను తన చేతిలోని మొబైల్ ను ఆమెపైకి విసిరేశాడు. అది కాస్త ఆమె కాళ్ల ముందు పడింది. దీంతో ఆ ఫోన్ విసిరిన అభిమానికి సెల్ఫీ ఇచ్చిన సాయిపల్లవి.. ఇకమీదట ఇలా చేయకు అని కాస్త కోపంగా చెప్పింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరోవైపు ‘అమరన్’ మూవీ రిలీజ్‌కి ముందు సాయి పల్లవి, ‘విరాట పర్వం’ సమయంలో మాట్లాడిన ఓ పాత వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ సమయంలో ‘మన ఆర్మీని చూసి పాకిస్తాన్ జనాలు భయపడతారు. వాళ్లకు మన ఆర్మీ, టెర్రరిస్టులుగా కనిపిస్తుంది..’ అంటూ వ్యాఖ్యానించింది సాయి పల్లవి. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెను దుమారం రేపింది. ఆర్మీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి, మేజర్ భార్య పాత్రలో నటించడం ఏంటని ఇప్పుడు ‘బాయ్‌కాట్ సాయి పల్లవి’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు..