Hyderabad: నానక్రాంగూడ రోటరీ సమీపంలో జరిగిన ఆక్సిడెంట్ లో ఇంజినీరింగ్ విద్యార్థి మరణించింది. రాయదుర్గం ఎస్‌ఐ ప్రణయ్ తేజ్ చేపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి దోమలకొండకు చెందిన ఐరేని శివాని (21) గండిపేట సీబీఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆదివారం నిజామాబాద్ నిజాంసాగర్‌లో ఆమె చదువుకున పాఠశాలలో గెట్ టు గెదర్ జరగడంతో ఆ కార్యక్రమంలో ఆమె పాలుగొని పాత స్నేహితులతో సరదాగా గడిపి మల్లి హైదరాబాద్ కి వచ్చింది.జేఎన్‌టీయూ వద్ద బస్సు దిగిన ఆమెను తన సీనియర్ విద్యార్థి వెంకట్‌రెడ్డి (26) పీజీ దగ్గర దింపుతా అనడంతో ఆమె అతని బైక్ పైన కూర్చుంది.
ఇది కూడా చదవండి: Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Hyderabad: అక్కడ నుండి వాళ్లు బయలుదేరారు. అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ దగ్గర వేగంగా వస్తున్న కారు వల్ల బైక్ ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకోని వెళ్లారు. ఐరేని శివాని అప్పటికే మరణించింది అని డాక్టర్ తెలిపారు. వెంకట్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కారుడ్రైవింగ్ చేసిన సాయికైలాష్ (19) ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.