Bhaskar: సంధ్య థియేటర్ ఘటన కారణంగా అల్లు అర్జున్ ని పోలీస్ అరెస్ట్ అయ్యారు తర్వాత బెయిల్ కూడా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇపుడు సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి భర్త NDTV కి ఇచ్చిన ఇంటర్వ్యూ మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదు అని. మా అబ్బాయి అల్లు అర్జున్ కు పెద్ద అభిమాని.. పుష్ప 2 సినిమాకు వెళ్దామని నెల రోజుల ముందు నుంచి అడిగేవాడు అని అయన అన్నారు. దింతో అబ్బాయి కోరిక మేరకు తనకు తెలిసిన స్నేహితులను అడిగి టిక్కెట్లు తీసుకున్నాఅని తెలిపారు. తమ వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం నచ్చలేదు. ఘటన జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ నుంచి మాకు మద్దతు లభించింది. మేము వేసిన కేసు కూడా వెనక్కు తీసుకోవాలని అనుకున్నాం అని రేవతి భర్త భాస్కర్ చెప్పారు.