TG Congress

TG Congress: కేటీఆర్‌కు చెక్… కేసీఆర్ మేనల్లుడికి కాంగ్రెస్ బంపరాఫర్‌‌..!

TG Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఒత్తిడి పెంచడంతో పాటు.అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం విమర్శలు చేస్తూ గులాబీ పార్టీ అధికార పార్టీని ఇరుకున పెడుతుంది. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌ని నిలువరించేందుకు భారీ స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. 

కేసీఆర్‌, కేటీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు ఓ భారీ అస్త్రాన్ని సిద్దం చేసినట్టు సమాచారం. సొంత ఇంట్లో నుంచే కేసీఆర్‌కు దిమ్మతిరిగే రేంజ్‌లో ఓ నేతకు పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ వేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేసీఆర్‌ మేనల్లుడు ఉమేష్‌ రావుకు రాజన్న సిరిసిల్లా జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టాం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమేష్ రావుకు సిరిసిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్‌ ఫ్యామిలీకి చెక్‌ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నారట. ఇప్పుడు అదే ఉమేష్‌ రావు అనే అస్త్రాన్ని వదిలేందుకు కాంగ్రెస్‌ సిద్దమైనట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: TS Cabinet Ministers: మరో 6 మంత్రి పదవి ఖాళీలు.. తెలంగాణ కేబినెట్‌లో ఛాన్స్ దక్కేదేవరికి?

TG Congress: ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ కొనసాగుతున్నారు. త్వరలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు సిరిసిల్ల నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే… ఇందులో 14 సార్లు వెలమ సామజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు.

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లా కావడంతో…ఆ జిల్లా అధ్యక్ష పదవిని కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుందట… సిరిసిల్లలో అదే సామాజికవర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ యోచిస్తుంది. అందుకుగానూ కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్‌ రావు పేరును హైకమాండ్‌ చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందట…ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్‌ కుటుంబానికి చెక్‌ పెట్టినట్టు అవుతుందని భావిస్తుంది. మరోవైపు ఉమేష్‌ రావుకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా వెలమ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్‌ నేతల ఎత్తుగడగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *