Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆరు నెలలపాటు పా\స్‌పోర్టును అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ మంజూరు కోసం గతంలో రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాల్సి వచ్చింది. దీంతో విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కోర్టు అనుమతితో పాస్‌పోర్ట్‌ను పొందాల్సి వస్తున్నది. దీంతో ఇదే నెలలో విదేశీ పర్యటన ఉన్న కారణంగా ఆయన కోర్టుకు చేసిన వినతి మేరకు ఈ అనుమతి వచ్చింది.
Revanth Reddy: ఈ నెల 13 నుంచి 23 తేదీ వరకు ఆస్ట్రేలియా, దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో క్రీడలపై స్టడీ చేసేందుకు వెళ్లనున్నారు. అదే విధంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ సదస్సులో పాల్గొననున్నారు. అదే విధంగా సింగపూర్ కూడా ఆయన వెళ్లనున్నారు. ఈ మేరకు ఆరు నెలలపాటు పాస్‌పోర్ట్ అనుమతి కోరుతూ ఆయన ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: చదువు ఖర్చులకు తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోవడం కూతురి చట్టపరమైన హక్కు
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇదేరోజు పాస్‌పోర్ట్‌ను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. జూలై 6వ తేదీన మళ్లీ పాస్‌పోర్ట్‌ను తిరిగి కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఆయన విదేశీ పర్యటనకు ఆటంకం లేకుండా పోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌రెడ్డి.. లండన్, అమెరికా దేశాలకు వెళ్లొచ్చారు. అప్పుడు కూడా ఆయన కోర్టు అనుమతితో పాస్‌పోర్టును పొంది వెళ్లొచ్చారు.