ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రక్తపాతం సృష్టించి ప్రజలను, ఓటర్లను తుపాకులతో భయభ్రాంతులకు గురిచేసేందుకే వైసీపీ నాయకత్వం పంజాబ్ నుంచి కిరాయి రౌడీ మూకలను దిగుమతి చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు.
నిన్నటి ఘర్షణల వెనుక కూడా ఈ అంతర్రాష్ట్ర నేరగాళ్ల హస్తం ఉందని, వీరి ద్వారా పట్టణంలో అలజడి సృష్టించేందుకు పథకం రచించారని మండిపడ్డారు. పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు తనిఖీలు చేపట్టాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
స్థానిక ఎన్నికల దృష్ట్యా @ysjagan చాలా ఎత్తున హింసాకాండకు ప్లాన్ చేసినట్టుంది. రాయచోటి గొడ్డలి పార్టీ అభ్యర్థికి మద్దతుగా పంజాబ్ నుంచి ఏపీకి దిగుమతైన గ్యాంగ్ ఇది. మారణాయుధాలతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఇంకెన్ని గ్యాంగులను జగన్ ఎక్కడెక్కడ నుంచి తెప్పించాడో ఎక్కడెక్కడ రంగంలోకి దింపుతున్నాడో!
#EndOfYCP
#AndhraPradesh— Telugu Desam Party (@JaiTDP) October 17, 2026
