Ravi Teja: మాస్ మహారాజా రవితేజకు 2024 అంతగా కలసి రాలేదు. 2023 సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’నే రవితేజ లాస్ట్ హిట్. ఆ తర్వాత రవితేజ నటించిన ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ అదే ఏడాది వచ్చి ప్లాఫ్స్ లిస్ట్ లో చేరాయి. ఇక ఈ ఏడాది రవితేజ నటించిన ‘ఈగిల్, మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ఒకదానిని మించి మరోటి ఘోర పరాజయం పొందాయి. అంతే కాదు ఈ ఏడాది షూటింగ్ లో గాయపడ్డ రవితేజ కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిర్మాతగా 2023లో ‘రావణాసుర, ఛాంగురే బంగారు రాజా’ సినిమాలు, 2024లో ‘సుందరం మాస్టర్’తో రవితేకు నిరాశే ఎదురైంది. రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’తో పాటు ‘కోహినూర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకూ కథల కంటే పారితోషికానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వచ్చిన రవితేజ ఇకపై కథల విషయంలో ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది. 2025లో రాబోయే ‘మాస్ జాతర, కోహినూర్’ పై ఫ్యాన్స్ తో పాటు రవితేజ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి రవితేజ కోరుకుంటున్న సక్సెస్ ను 2025 అతనికి అందిస్తుందేమో చూడాలి.