New Year 2025: 2025వ సంవత్సరం వచ్చేసింది. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. అంతకుముందు, 2024 చివరి హారతి వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్, అయోధ్యలోని సరయూ ఘాట్‌లో జరిగింది. ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఢిల్లీ ఇండియా గేట్ నుండి ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో చలిగాలులు వీస్తున్నప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణాలు, నగరాలనే కాకుండా పల్లెల్లో కూడా న్యూ యియర్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. బాణాసంచా మెరుపులు.. మందు పార్టీలతో దేశమంతా న్యూ ఇయర్ కోలాహలం కనిపించింది. చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనాల కోసం ప్రజలు బారులు తీరారు.