Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మలయాళ సినిమా రీమేక్ హక్కులు పొందారు. మలయాళంలో పాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా ఘన విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమాను బాలకృష్ణతో రీమేక్ చేయటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దీనిని రవితేజ తన సొంత నిర్మాణ సంస్థ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ లో తీయబోతున్నారట. మలయాళంలో వందకోట్ల వసూళ్ళు చూసిన ఈ సినిమాలో పాహద్ గాంగ్ స్టర్ గా నటించాడు. ఇప్పడు ఈ మూవీలో రవితేజనే నటిస్తాడా? లేక వేరే హీరోతో తీస్తాడా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రవితేజ. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ‘ధమాకా’ తర్వాత రవితేజకు సరైన హిట్ లేదు. అందుకే భాను భోగవరపు సినిమాపైనే రవితేజ ఆశలన్నీ ఉన్నాయి. ‘ఆవేశం’ రీమేక్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.
