Rashmika Mandanna: పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్ గా మారిపోయిన రశ్మిక మందణ్ణ కొంతకాలంగా స్ట్రయిట్ హిందీ చిత్రాలలోనూ నటిస్తోంది. రణబీర్ కపూర్ సరసన రశ్మిక చేసిన యానిమల్ మూవీ ఘన విజయాన్ని సాధించి, ఆమె ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ ను వేసింది. అలానే రశ్మిక ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఛావా చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. విక్కీ కౌశల్ శంభాజీగా నటిస్తున్న ఈ చారిత్రక చిత్రంలో ఆయన భార్య యశూబాయిగా రశ్మిక నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఆమె పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఛావా సినిమా ట్రైలర్ ను 22న విడుదల చేయబోతున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram