Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్మాది చేతిలో ఎలక్ట్రిక్ రంపం దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోంది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వరుస హెల్త్ అప్డేట్స్ పంచుకున్నారు. బాలిక స్పృహలోకి వచ్చిందని, వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారని (Extubated) ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేష్ ట్వీట్ వివరాలు..
ప్రాథమిక ఆప్తాల్మాలజీ (కంటి పరీక్షలు), న్యూరో సర్జరీ రివ్యూలలో ఎలాంటి తీవ్రమైన సమస్యలు కనిపించలేదని వైద్యులు ధ్రువీకరించారు. ఈ వారం చివర్లో కంటికి సంబంధించిన సమగ్ర పరీక్షలతో పాటు ఆర్థోపెడిక్ సర్జరీ చేయనున్నారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Update (9 30 AM, 3rd November 2026):
The girl child is showing steady improvement. Eyes are open and all vital parameters remain stable. Initial ophthalmology and neurosurgery reviews show no major concerns. Further detailed eye evaluations and ortho surgery will follow later this week. Continuous monitoring is underway, and we are praying for a full and speedy recovery!
— Lokesh Nara (@naralokesh) November 3, 2026
వైద్యులతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్
