Upasana-Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్ లో అన్యోనమైన జంట. మెగా కోడలిగా ఉపాసన గురించి ప్రత్యేకంగా తెలియచేయవలసిన అవసరం లేదు. కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తూ మెడికల్ రంగంలో కూడా ఎంటర్ ప్రెన్యూరర్ గా రాణిస్తున్నారు. ఈ జంటపై మెగా అభిమాని ఓ అద్భుమైన వీడియోను రూపొదించాడు. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ ‘నానా హైరానా’ తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఉపాసన కూడా స్పందించింది. వీడియో చాలా మద్దుగా ఉంది… మీ ప్రేమకు కృతజ్ఞతలు అనే క్యాప్షన్ కూడా పెట్టేసింది. ప్రస్తుతం మైసూర్ లో బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. చెర్రీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘నానా హైరానా’ పాట థర్డ్ సింగిల్ గా వచ్చేసింది. సినిమాలోని పాటతో పాటు చెర్రీ, ఉపాసన విజువల్స్ పై నెటిజెన్ క్రియేట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుండటం విశేషం.
The Bestest Version of #NaanaaHyraanaa 🩷🎵@AlwaysRamCharan @upasanakonidela
E.C. @ManiRockzz77 pic.twitter.com/YUglEHLzFH
— Raees | 10.01.2025 🚁 (@RaeesHere_) November 27, 2024