Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’. రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. ఈ సినిమాలోని ఒక హై-వోల్టేజ్ స్పెషల్ మాస్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.
ఈ ప్రోమో చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఊరమాస్ బీట్స్, దానికి తోడు రామ్ చరణ్ తనదైన శైలిలో వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం చరణ్ మాత్రమే కాకుండా.. ఈ స్పెషల్ సాంగ్‌లో స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్, అలాగే ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ ముగ్గురు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో ఊరమాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఫ్లోర్‌పై అరాచకం సృష్టించారని చెప్పొచ్చు.
ఈ ఫుల్ సాంగ్‌ను రేపు మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగబోయే ఒక భారీ లైవ్ ఈవెంట్‌లో అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కేవలం ప్రోమోతోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సాంగ్.. రేపు ఫుల్ వీడియో బయటకు వచ్చాక ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
