Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈసారి ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. తమ ఇంట్లోకి ఇద్దరు చిన్నారి అతిథులు రావడం పట్ల మెగా కుటుంబం ఎంతో మురిసిపోతోంది. ఇప్పటికే ఈ దంపతులకు క్లింకార అనే కుమార్తె ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు క్లింకారకు తమ్ముడు, చెల్లెలు తోడయ్యారు.
మెగా వారసులు అడుగుపెట్టారన్న వార్త తెలియగానే అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి ఇంట్లో మళ్ళీ సందడి మొదలవ్వడంతో మెగా కాంపౌండ్‌లో పండగ వాతావరణం నెలకొంది.
