Viral News: దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇల్లు మొత్తం తిరిగి చూశాడు, ఎక్కడా కూడా లోపలికి వెళ్లడానికి కుదరలేదు. అలా చూస్తున్న సమయంలో కిచెన్ లో ఉన్న ఎగ్జాస్ట్ షాఫ్ట్ (ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండే ప్లేస్) దగ్గర గ్యాప్ ఉండటం గమనించి, అందులోంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక చిక్కొచ్చింది, అతను మధ్యలో ఇరుక్కుపోయి గంట సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌లోని కోటాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. జనవరి 3న సుభాష్ కుమార్ మరియు అతని భార్య బయటికి వెళ్లారు. అదే రోజు ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ దొంగతనం చేయలేకపోయారు.
ఇది కూడా చదవండి: Bangladesh: 35 రోజుల్లో 11 మంది హిందువుల హత్య..
దొంగతనం చేయడానికి కిచెన్ లో ఉన్న ఎగ్జాస్ట్ షాఫ్ట్ నుండి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించి ఒకడు మధ్యలో చిక్కుకున్నాడు. మరుసటి రోజు పని పూర్తిచేసుకొని సుభాష్ కుమార్, అతని భార్య ఇంటికి వచ్చారు.
ఇంటి ముందు స్కూటర్ ఉండటంతో అనుమానం వచ్చి అరవగా, లోపల దొంగతనానికి వచ్చిన వారిలో ఒకరు పారిపోగా.. ఇంకొకరు ఎగ్జాస్ట్ షాఫ్ట్ లో ఇరుక్కుపోయి కనిపించారు. దొంగను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంట సేపు కష్టపడి దొంగను అందులోంచి బయటికి తీశారు. అతనితో వచ్చిన ఇంకో వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఇతనిపై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా అని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
In Rajasthan’s Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer’s car. 😳
pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026

