Raghava Lawrence: లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. ‘కాల భైరవ’ పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీని రమేశ్ వర్మి దర్శకత్వంలో ఎ స్టూడియోస్ ఎల్ఎల్ పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. లారెన్స్ కెరీర్ లో ఇది 25 చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది. యాక్షన్, ఎడ్వెంచర్ గా రూపొందే ఈచిత్రం నుంచి లారెన్స్ లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిల, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అయ్యే ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘రాక్షసుడు, ఖిలాడి’ చిత్రాల తర్వాత రమేశ్ వర్మ, కోనేరు సత్యనారాయణ కలయికలో వస్తున్న చిత్రమిది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు.