Breaking News

Breaking News: పుంగనూరులో భగ్గుమన్న రాజకీయం.. నామినేషన్ల తొలిరోజే రాళ్లదాడి.. వాహనాలు ధ్వంసం, టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు!

Breaking News: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఇరు పార్టీల వర్గాలు ఒకేసారి ర్యాలీగా బయలుదేరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పరిసర ప్రాంతాలన్నీ రణరంగంగా మారాయి. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమవగా, టీడీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా మధు అనే టీడీపీ కార్యకర్త రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగానే బెంగళూరు నుంచి కిరాయి రౌడీలను రప్పించి తమ కార్యకర్తలపై పథకం ప్రకారం దాడులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ల తొలిరోజే ఇంతటి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో పుంగనూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *