Protocol Issue

Protocol Issue: కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ

Protocol Issue: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి జూల్లి కృష్ణారావు. సదరు మంత్రి అడపాడప జిల్లాకు వచ్చి వెళ్తుంటారు. నిజామాబాద్ జిల్లాకు ఇంకా మంత్రి పదవి రాలేదు. కానీ పాలన వ్యవహారాల బాధ్యతలను మాత్రం మంత్రి జూపల్లి కృష్ణారావుకి అప్పగించింది కాంగ్రెస్‌ అధిష్టానం… కానీ ఆయన అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్తున్నారన్న టాక్ జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. ఇదంతా అంటుంచితే ఇన్‌చార్జ్ మంత్రి వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ వివాదం కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది.

దాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఆర్ముర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి మంత్రి విజిట్ చేస్తారని తెలియటంతో నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవటంతో ఆయన మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఫోటో లేకపోవటం ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. 

మంత్రి వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతోందంటూ అక్కడి అధికారులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గట్టిగానే నిలదీశారు. అయితే అధికారులు మాత్రం నోరు మేదపని పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న కాంగ్రెస్‌-బీజేపీ కార్య‌కర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఎమ్మెల్యే సమక్షంలోనే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. అయితే ఈ ప్రోటోకాల్ రగడకు కారణం ఎవరు అన్నదానిపై అధికారులు నోరు మెదపడం లేదు.

ఇది కూడా చదవండి: Cyclone Fengal: తీరం దాటిన ఫెంగల్.. తమిళనాడులో భారీ వర్షాలు..

Protocol Issue: అటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ అదే సీన్ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పాటించటం లేదంట అధికార పార్టీ…అధికారిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో బీజేపీ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదంట.మరోవైపు అధికారులు సదరు ఎమ్మెల్యే మాట కూడా వినటం లేదని టాక్‌ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే లు ఉన్నారు. పేరుకే ఎమ్మెల్యేలు అన్నట్లు ఉందంట వారి పరిస్థితి. అభివృద్ధి నిధులు లేక కనీసం అధికారులు కూడా వారి మాట వినటం లేదని సదరు బీజేపీ ఎమ్మెల్యే లు వాపోతున్నారట. 

ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను కించ పరిచేలా అధికార పార్టీ నాయకులు వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు కమలం పార్టీ ప్రజా ప్రతినిధులు. కనీసం ఫోటో కూడా పెట్టకుండా తమ పరువు తీసేలా వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టకూడదని అధికారులకు ఎవరు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు నీలదీస్తున్నారు. కావాలనే అధికార పార్టీ నేతలు తమ ఫోటోలు పెట్టకుండా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండా చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారకుండా చూడాలని అధికారులకు కాంగ్రెస్‌ అధిష్గానం హెచ్చరిస్తుందంటా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *