Nirmal: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు కొనసాగుతోంది.. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు రెండు వాహనాల్లో వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎందుకు అదుపులో తీసుకుంటున్నారని స్థానికులు ప్రశ్నించారు… ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు…నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ వద్ద జాతీయ రహదారిపైకి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. దిలావర్ పూర్ లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలని పురుగుల మందు డబ్బలతో నిరసన కొనసాగుతుంది.
