Pinaka Title Teaser

Pinaka Title Teaser: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పినాక’ మూవీ టైటిల్ టీజర్

Pinaka Title Teaser: గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ ‘పినాక’ మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజైయింది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌ నిర్మాణంలో, గణేష్ క్షుద్ర, రుద్ర గా స్టన్నింగ్ న్యూ అవతార్ లో తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజువల్ స్పేక్లింగ్‌తో, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ తో గ్రాండ్ పీరియాడిక్ డ్రామాగా ఈ టీజర్ సాగింది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్ ఎక్స్ తో ‘పినాక’ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

ఈవార్త కూడా చదవండి: Ram Charan: రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ విడుదల సమయంఫై రామ్‌చరణ్‌ అంచనా ఇదే!

Sai Pallavi: ‘ఆకాశంలో ఒక తార’లో సాయిపల్లవి డౌటే

Sai Pallavi: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ హ్యాట్రిక్ సాధించారు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ చిత్రాలో ఆయన మెప్పించారు. అలానే ‘కల్కి 2898 ఎ.డి.’లోనూ అతిథిపాత్రలో దుల్కర్ మెరిసారు. ఆయన హీరోగా స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాను నిర్మించబోతున్నాయి. పవన్ సాదినేని దీనికి దర్శకుడు.

Sai Pallavi: ఫిబ్రవరి 5 నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తొలుత సాయిపల్లవిని అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్స్ ప్రాబ్లమ్ కారణంగా ఆమె స్థానంలో వేరొకరు రావచ్చనే మాట వినిపిస్తోంది. మరి కొద్ది రోజులలో హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ తెలిసే ఛాన్స్ ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *