Pawan Kalyan: హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామో చెప్పలేను కానీ మా వంతు ప్రయత్నం మాత్రం పూర్తిగా చేశామని ఆయన తెలిపారు.
“కోహినూర్ గురించి ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వెంటనే అంగీకరించాను. ఈ సినిమా మేకింగ్‌లో చాలా కష్టపడ్డాం. ఇంత కష్టపడి చేసిన ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందో నేను చెప్పలేను కానీ మా హృదయం నుంచి చేసిన సినిమా ఇది” అని పవన్ చెప్పారు.
పవన్ ప్రత్యేకంగా చేసిన కృషి
పవన్ మాట్లాడుతూ – “మీరు అంటారు కదా డాన్సులు చేయరని, అందుకే మీ కోసం కాలు కదిలించాను. ఫైట్స్ చాలా కాలం తర్వాత చేశాను. ఈ 18 నిమిషాల క్లైమాక్స్ ఫైట్‌కి నేను స్వయంగా కొరియోగ్రఫీ చేశాను. ఆ కాలంలో సగటు భారతీయుడు ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా చూపిస్తుంది” అని వివరించారు.
అభిమానులకే పవన్ హృదయం
“నా గుండె మీ కోసం కొట్టుకుంటుంది. మీరు కష్టాల్లో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా… మనల్ని ఎవరు ఆపలేరు. మీరే నా బలం. వయసు పెరిగింది కానీ గుండెల్లోని జోష్ తగ్గలేదు” అని ఆయన అభిమానులను ఉద్దేశించి చెప్పారు.
ఇది కూడా చదవండి: Ginger Tea Benefits: అల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
వ్యక్తిగతంగా చెప్పిన విషయాలు
పవన్ మాట్లాడుతూ –
-
“డబ్బుకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు, బంధాలకే ఇచ్చాను.”
-
“పెద్ద పెద్ద దర్శకులు నాకొచ్చి సినిమాలు చేయలేదు. రీమేక్‌లతో డబ్బు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ నేను ఒక ఫ్లాప్ ఇచ్చా. దాని తర్వాత ఇండస్ట్రీలో గ్రిప్ రాలేదు. ఆ టైమ్‌లో త్రివిక్రమ్ వచ్చి నన్ను వెతికాడు. అతడు నా ఆత్మబంధువు” అని చెప్పారు.
-
“క్రిష్ వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు” అని ఆయన వివరించారు.
సినిమా విడుదల వివరాలు
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన హరిహరవీరమల్లు జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పవన్ అభిమానులు ఈ సినిమాను ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
