Nidhi Agarwal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. కానీ, ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరగడానికి పవన్ రాజకీయ బాధ్యతలే కారణమని వచ్చిన వార్తలను హీరోయిన్ నిధి అగర్వాల్ ఖండించారు. కోవిడ్ సమయంలో రెండేళ్లు షూటింగ్ నిలిచిపోవడం, పీరియాడికల్ చిత్రం కావడంతో సెట్స్, వీఎఫ్ఎక్స్ వంటి అంశాలు సమయం తీసుకోవడమే ఆలస్యానికి కారణమని ఆమె స్పష్టం చేశారు.
Also Read: Superman: సూపర్‌మ్యాన్ కథలో రానా దగ్గుబాటి మెరుపు!
పవన్ తన పాత్ర కోసం పూర్తి ఫోకస్‌తో పనిచేశారని చెప్పిన నిధి, ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దీంతో తమ హీరోపై స్టాండ్ తీసుకున్నందుకు పవన్ అభిమానులు నిధికి పిచ్చ ఫిదా అవుతున్నారు. బాబీ డియోల్ విలన్‌గా, ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ చిత్రం అంచనాలను మించి అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.