Hyderabad: హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ నివాసంపై జరిగిన దాడి చేసిన ఓయూ జేసీ నేతలు తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఎందుకంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ అభిమానులపై ఆగ్రహంతో, ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు.ఈ దాడి విషయంలో జేఏసీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.తాజాగా ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. తమకు అల్లు అర్జున్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని నేతలు తెలిపారు. కొన్ని కాల్స్‌లో చంపేస్తామని స్పష్టంగా బెదిరించారని చెప్పారు.అల్లు అర్జున్ అభిమానుల పేరుతో వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని, తమ ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.తమను బెదిరిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని ఓయూ జేఏసీ నేతలు పోలీసులను కోరారు. ఈ పరిణామాలు సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.