Jathara

Jathara: పాతకోట తిరుణాల..

Jathara: జిల్లాలోనే అన్ని తిరణాలలో ఈ తిరుణాల తర్వాతనే జరుగుతాయి. అన్ని తిరణాలలకు ఆది తిరుణాల ఈ గ్రామ తిరుణాలనే. సంక్రాంతి పండుగ కు మొదలయ్యే ఈ గ్రామ తిరుణాల సుమారు నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహిస్తారు. ఆడపడుచులు బంధువులతో ఈ నాలుగు రోజులు గ్రామం కిటకిటలాడుతుంది . బండలాగుడు పోటీలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామం తిరుణాల కలతో వెలిగిపోతుంది, ఆ గ్రామం ఎక్కడుంది దాని విశిష్టత ఏమి అన్నదే ఈ కథనం.

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని పగిడాల మండలంలో గ్రామమే ప్రాతకోట. ఈ గ్రామంలోని దేవాలయమే శ్రీ గంగా సమేత పార్వతీ నాగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఏడో శతాబ్ద కాలానికి చెందిన దేవాలయం. పూర్వం వీరనారాయణపురం అనే గ్రామం ఉండేది, ఆ గ్రామం శిబిలమైపోవడం తర్వాత కాలంలో శ్రీశైలం జలాశయం నిర్మాణంలో మునిగిపోవడం జరిగిందని, దేవాలయాన్ని అక్కడి గ్రామ ప్రజలు ఈ పాతకోట గ్రామంలో పున నిర్మించడం జరిగిందని ఎంతో మహిమాన్విత కలిగిన దేవాలయం అని చరిత్ర చెబుతుందని గ్రామస్తులు తెలిపారు. సంక్రాంతికి మొదలయ్యే స్వామివారి తిరుణాల సుమారు ఏడు రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రతతో నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahakumbh Mela 2025: ఇదీ సనాతన ధర్మ గొప్పదనం! ఒకప్పుడు అమెరికా ఆర్మీలో మైఖేల్.. మహా కుంభ్ లో బాబా మోక్షపురిగా సన్యాసం!!

Jathara: స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారని అంత మహిమ కలిగిన స్వామి ఈ గంగా సమేత పార్వతీ నాగేశ్వర స్వామి అని, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గతంలో స్వామివారి ఊరేగింపుకు పాత రధం ఉండేదని, అది శిధిలావస్థకు చేరుకోవడంతో కొత్త రథాన్ని గ్రామస్తుల సహకారంతో తయారు చేపించడం జరిగిందని, ఈ రథ నిర్మాణం పూర్తిగా శాస్త్రృత్తంగా నిర్మించడం జరిగిందని, రథము చుట్టూ జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను, శివపార్వతుల యొక్క ప్రతిమలను శిల్పులు చెక్కడం జరిగిందని అన్నారు. ఈ రథము చుట్టూ ప్రదక్షిణ చేస్తే భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను, శక్తి పీఠాలను దర్శించినట్లేనని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ తిరుణాల మహోత్సవాన్ని ప్రజలందరూ తిలకించాలని అలాగే శ్రీ శ్రీ గంగా సమేత పార్వతి నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Anitha: కేజీకి, టన్నుకీ తేడా తెలియని జగన్‌!"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *