AP Government

AP Government: ఏపి ప్ర‌భుత్వం తీపి క‌బురు.. చెల్లింపులు షురూ

AP Government: సంక్రాంతి ప‌ర్వ‌దినాన ప‌లు వ‌ర్గాల‌కు ఏపి ప్ర‌భుత్వం తీపి క‌బురు పంపింది.. గ‌త కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల‌కు మోక్షం ల‌భించింది..సీఎం చంద్రబాబు ఆదేశాల‌తో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది..విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లుల‌ను ఆర్ధిక శాఖ వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తోంది..ఇవాళ సాయంత్రంలోగా రూ. 6700 కోట్ల బిల్లుల చెల్లించ‌నుంది ఆర్థిక శాఖ.సియం అదేశాల‌తో ఆర్ధిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ఎప్ప‌టి క‌ప్పుడు బిల్లులు చెల్లింపుల‌ను మానిట‌ర్ చేస్తున్నారు.

సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని అంద‌రు సంతోషంగా జ‌రుగుకోవాల‌ని సియం చంద్ర‌బాబు కోరారు..దీనిలో భాగంగా ప‌లు వ‌ర్గాల‌కు గ‌త కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బాకాయిల‌ను నేడు రాష్ట్ర ప్ర‌భుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌డం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జ‌గ‌న్ స‌ర్కార్ పెండింగ్ లో పెట్టింది..అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6700 కోట్లు రుపాయిలు నిధులు విడుద‌ల చేశారు..ఇందులో ప‌ది లక్ష‌ల లోపు బిల్లులు,ఉద్యోగుల జీపిఎఫ్, పోలీసుల స‌రెండ‌ర్ లీవులు, విద్యార్దులు ఫీజు రియంబ‌ర్స్ మెంట్ లాంటివి ఉన్నాయి,,గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో దాదాపు ల‌క్షా 20 వేల కోట్లు రుపాయిలు పెండింగ్ లో పెట్టింది.

2014 – 19 మ‌ధ్య‌లో టీడిపి పాల‌న‌లో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించ‌లేదు..అందులో చిన్ని చిన్న కాంట్రాక్ట‌ర్లు, చిన్న ప‌రిశ్ర‌మల‌కు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ఇలా అనేక మైన బిల్లులు పెండింగ్ లో పెట్టింది జ‌గ‌న్ స‌ర్కార్..అయితే రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అధికారంలోకి రావ‌డంతో అన్నివ‌ర్గాలు వారు ఊపిరి పీల్చుకున్నారు..ఇప్పుడు కుట‌మి స‌ర్కార్ కు పెండింగ్ బిల్లు చాలా పెను భారంగా మారింది..ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది..దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లింపులు భారంగా మారింది.

 AP Government: నేడు రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన పెండింగ్ బిల్లుల్లో..పోలీస్ లు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి….ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు నిధులు నేడు విడుద‌ల చేశారు..పోలీస్ ల‌వి రెండు సరెండర్ లీవుల‌కు గాను..ఒక ఇన్స్టాల్ మెంట్ బ‌కాయి క్రింద‌ 213 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేశారు..మ‌రో వైపు సిపియ‌స్ క్రింద‌ 300 కోట్లు నిధులు విడుదల చేయ‌గా. టిడియ‌స్ క్రింద 265 కోట్లు చెల్లింపులు చేసింది ఆర్ధిక శాఖ‌.. మొత్తంగా ఉద్యోగులకు 1300 కోట్లు పెండింగ్ బిల్లులుకు నిధులు విడుదల చేశారు..ఇదే క్ర‌మంలో సుమారు 6.5 లక్ష‌ల మంది విద్యార్ధులకు గ‌త ప్ర‌భుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబ‌ర్స్ మెంట్ నిధులు 788 కోట్లు రుపాయిలు జ‌మ కానున్నాయి.

ఇది కూడా చదవండి: Mahakumbh Mela 2025: ఇదీ సనాతన ధర్మ గొప్పదనం! ఒకప్పుడు అమెరికా ఆర్మీలో మైఖేల్.. మహా కుంభ్ లో బాబా మోక్షపురిగా సన్యాసం!!

గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా దారుణంగా వ్య‌వ‌హ‌రించింది..స‌హ‌జంగా ప్ర‌భుత్వాలు మారినా ప్ర‌భుత్వ ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల కు బిల్లులు చేయ‌డం అనేది ప్రభుత్వం భాద్య‌త‌..కానీ టీడిపి ప్ర‌భుత్వం లో ప్ర‌భుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్ట్ ప‌నులు చేసిన వారికి కూడా రాజ‌కీయ క‌క్ష్య‌తో బిల్లులు గ‌త ఐదేళ్ల పాటు చెల్లించ‌కుండా వేల కోట్లు పెండింగ్ పెట్టారు..నేడు చిన్న ,చిన్న ప్రభుత్వ కాంట్రాక్టు ప‌నులు చేసిన 26 వేల మందికి 10 లక్షల లోపు బిల్లులవి 586 కోట్లు నిధులు విడుదల చేశారు..ఇదే క్ర‌మంలో 650 చిన్న కంపెనీల‌కు గాను ప్ర‌భుత్వ రాయితీలు క్రింద 90 కోట్లు విడుద‌ల చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ వివిధ వ‌ర్గాల‌కు ఇచ్చే విద్యుత్ స‌బ్సిడీ క్రింద 500 కోట్లు విడుదల చేశారు..జ‌గ‌న్ ప్రభుత్వం లో గొప్ప‌లు చేప్పుకున్న ఆరోగ్య శ్రీ బ‌కాయిలు దాదాపు 3 వేల కోట్లు పెండింగ్ పెట్టింది..దీనిలో విడ‌త‌ల వారికి ఇప్ప‌టికే కొన్ని చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ కు 400 కోట్లు చెల్లింపు చేసింది..గ‌త ఐదేళ్ల పాటు అమ‌రావ‌తి రైతుల‌ను అనేక క‌ష్టాలు పాలు చేసింది.. రైతులకు ఇచ్చే ఏడాది కౌలు పెండింగ్ బకాయిల‌ను 241 కోట్లు రుపాయిల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. నేటి సాయంత్రం లోగా 6700 కోట్లు రుపాయిలు పెండింగ్ బిల్లులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ కానున్నాయి.

 AP Government: ఇలా పెండింగ్ బిల్లులు చెల్లించ‌డంతో పాటు..ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే ప‌ని చేస్తున్నారు సియం చంద్ర‌బాబు..ఇప్ప‌టికే ఎన్నో ఆర్ధిక క‌ష్టాలు వెంటాడు తున్నాయి.మ‌రో వైపు గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏకంగా 94 కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌ధ‌కాలు నిలుపుద‌ల చేసింది..చంద్ర‌బాబు వాటిల్లో 73 ప‌ధ‌కాల‌ను రివైవ్ చేయ‌డం కోసం ఏకంగా 6000 కోట్ల రూపాయలు కేటాయింపుల చేసి..తిరిగి వాటిల్ని ఏపిలో అమలు చేసేందుకు కేంద్రానికి అనుమ‌తి కోరింది..గ‌త ప్ర‌భుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడితే..చంద్రబాబు స‌ర్కార్ మాత్రం ప్ర‌జ‌ల ఆదాయం పెంచెందుకు వినియోగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *