Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా టీడీపీ, జనసేనపై, ముఖ్యంగా ఆనాటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై నోరు పారేసుకున్న వారిని ఒక్కొక్కరిగా ఇప్పుడు ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్ నేతలు, సోషల్ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుల్లో రిమాండ్ చేశారు. నాటి జగన్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేసి, వ్యక్తిగతంగా కించపరిచేలా దుర్భాషలాడి.. ప్రతిపక్ష నేతల మనోభావాలు దెబ్బతీసిన వారందరి లెక్కలు తేలుస్తున్నారు.
Posani Krishna Murali: ఇప్పుడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. ఆయన ఆనాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై ఎన్నోమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులపైనా తీవ్ర దూషణలు చేశారు. కార్యకర్తలను సైతం ఇష్టారీతిన దూషించారని జనసేన నేతలే స్వయంగా వివిధ చోట్ల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ ఆనాటి జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Posani Krishna Murali: దీంతో ఈనాడు కూటమి ప్రభుత్వ హయాంలో జనసేన నేతలు పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిశోర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ హయాంలో ఫిర్యాదులు చేస్తే అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని జనసేన నేతలు ఎస్పీకి వివరించారు. దీంతో అప్పుడు న్యాయస్థానానికి ఆశ్రయించామని తెలిపారు.
వరుసగా అరెస్టులు జరుగుతున్నా నేపథ్యంలో . . కేవలం చిన్న చిన్న వారిని అరెస్ట్ చేస్తున్నారని . . సెలబ్రిటీలు . . పెద్ద నాయకులూ కూడా అప్పట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా . . సోషల్ మీడియాలో రెచ్చిపోయినా వారి జోలికి పోవడం లేదంటూ విమర్శలు తలెత్తాయి . దీంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ , పోసాని కృష్ణమురళి వంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు . ఇప్పటివరకూ కేసులు నమోదు అయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరు దాదాపుగా అరెస్ట్ అయ్యారు . ఇప్పుడు పోసాని, ఆర్జీవీ అరెస్ట్ కూడా తప్పకపోవచ్చని భావిస్తున్నారు . ఏది ఏమైనా అప్పట్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రవర్తనతో ఇప్పుడు అందరూ ఇరుకున పడాల్సి వస్తోంది . కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది .