Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా, కీరవాణి స్వరపరిచిన ‘తారా తారా – ది సిజ్లింగ్ సింగిల్’ లిరికల్ ట్రాక్ మే 28 ఉదయం 10:20 గంటలకు విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌కు సంబంధించిన హాట్ & స్టైలిష్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమాకు గ్లామర్ టచ్ బాగానే అద్దినట్లు తెలుస్తుంది.ఈ ట్రాక్ అద్భుతంగా ఉందని ఇప్పటికే చర్చ జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
#TaaraTaara – The Sizzling Single! 🔥
Get ready to groove to the hottest track of the year from #HariHaraVeeraMallu 💃
Full song out on 28th May @ 10:20 AM! 💥
All set to Turn up the volume, and feel the heat! 🔊⚡️#HHVMonJune12th #HHVM #DharmaBattle #VeeraMallu
Powerstar… pic.twitter.com/2wQ85AZ6hv
— Mega Surya Production (@MegaSuryaProd) May 26, 2025