Vishnu Vinyasam: ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ ఖరారైంది. ఈ చిత్రం ‘విష్ణు విన్యాసం’ అనే పేరుతో ఫిబ్రవరి 2026లో రిలీజ్ కానుంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
తాజాగా మేకర్స్ టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీ విష్ణు వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యం నమ్మే వ్యక్తిగా కనిపించడంతో ఆసక్తిని పెంచింది. ఆయన స్టైలిష్ పసుపు రంగు మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో రైడ్ చేస్తున్న సన్నివేశాలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Also Read: Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్
హీరోయిన్‌గా నయన్ సారిక, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు.
చిత్రానికి జతచేసిన క్యాచీ ట్యాగ్‌లైన్ “No Brakes – Just Laughs” సినిమాకు సరైన హ్యూమర్ హైలైట్ చేస్తుంది. టైటిల్ వీడియోలో వాయిస్‌ఓవర్ ద్వారా “చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి” అని చెప్పడం, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. రధన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం హాస్యాన్ని మరింత పెంచుతోంది. ఈ సినిమా కామెడీ ఫన్ రైడ్గా మారబోతోంది అని చిత్ర యూనిట్ చెబుతోంది. శ్రీ విష్ణు అభిమానులు ఈ కొత్త చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
