Mike Tyson: ప్రపంచ ఆల్ టైమ్ గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్ 31 ఏళ్ల చిన్నవాడైన 27 ఏళ్ల అమెరికన్ బాక్సర్ జాక్ పాల్‌తో పోరాడాడు. 19 ఏళ్ల తర్వాత టైసన్ బరిలోకి దిగాడు. జాక్స్ 78–74తో టైసన్‌ను ఓడించారు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో జరిగింది. దీనికోసం చాలా మంది వినియోగదారులు ఒక్కసారిగా స్ట్రీమింగ్‌లో చేరారు. ఆ తాకిడికి , నెట్‌ఫ్లిక్స్ 6 గంటల పాటు నిలిచిపోయింది. అమెరికా. భారత్ లో 1 లక్ష మందికి పైగా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సిస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు.
ఇది కూడా చదవండి: Border-Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Mike Tyson: ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొత్తం ప్రైజ్ మనీ 60 మిలియన్ డాలర్లు అంటే 506 కోట్ల రూపాయలు. మ్యాచ్ గెలిచిన జాక్ పాల్ కు 40 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.338 కోట్లు, మైక్ టైసన్ కు 20 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.169 కోట్లు వచ్చాయి. 2005 తర్వాత మొదటిసారిగా బరిలోకి దిగిన టైసన్ జరిగిన మొదటి రెండు రౌండ్లలో జాక్ పై ఆధిక్యంలో ఉన్నాడు. దీంతో తర్వాతి నాలుగు రౌండ్లలో వెనుకబడ్డాడు. ఈ బౌట్‌లో జాక్ 78-74తో గెలిచాడు. ప్రత్యర్థులిద్దరి వయోసులో 31 ఏళ్ల తేడా ఉంది.