Balakrishna: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓ భారీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా టైటిల్ ను దీపావళికి ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పినా… అది జరగలేదు. అయితే ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడంతో పాటు టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిసింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో శ్రద్థా శ్రీనాథ్ హీరోయిన్. ఈ చిత్రం కోసం రకరకాల టైటిల్స్ అనుకున్నా… చివరకు ‘ఢాకు మహరాజ్’ అనే దానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి ‘వీరసింహారెడ్డి’తో గత యేడాది సంక్రాంతి బరిలో సందడి చేసిన బాలయ్య బాబు… వచ్చే యేడాది సంక్రాంతికి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.