Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ మహిళ కాల్ చేసి చంపుతానని బెదిరింపులకు దిగింది. దీనిపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధానినే చంపుతానని కాల్ చేయడంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెకు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? దేశంలో ఏదైనా మతవాద సంస్థతో లింకులున్నాయా? ఎందుకు చంపాలనుకుంటున్నదోనన్న విషయాలపై కూపీ లాగుతున్నారు.
Narendra Modi: ప్రధాని మోదీని తాను చంపుతానని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూముకు ఓ మహిళ ఏకంగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. ఆయనను చంపేందుకు తాను ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. దీనికోసం తాను ఆయుధం కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పేసింది. మతిస్థిమితం లేని మహిళ కూడా అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నంబర్ నుంచి వచ్చింది, ఎవరా మహిళ అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.