Narendra Modi

Narendra Modi: మంచినీటి పథకాల ఘనత అంబేద్కర్ కే చెందుతుంది ప్రధాని మోదీ

Narendra Modi: మధ్యప్రదేశ్ ఖజురహోలో కెన్-బెత్వా లింక్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. వాజ్‌పేయిపై తపాలా బిళ్లను విడుదల చేశారు. 

ఇది కూడా చదవండి: Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కాంగ్రెస్ ఫోర్జరీ కేసు

Narendra Modi: ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గురించి ప్రస్తావించారు. దేశంలో నీటికి సంబంధించిన పథకాలు అందించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని, అయితే కాంగ్రెస్‌ ఏనాడూ బాబా సాహెబ్‌కు ఆ ఘనత ఇవ్వలేదని చెప్పారు. “ఎంపీలో ఈరోజు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు చాలా స్ఫూర్తిదాయకమైన రోజు. నేడు అటల్ జీ జయంతి. నేడు ఆయన జయంతి 100 సంవత్సరాలు. దేశాభివృద్ధికి అటల్‌జీ చేసిన కృషి మన స్మృతిలో నిలిచిపోతుందని ఆయన నాకు చెప్పారు” అంటూ ప్రధాని మోదీ మాజీ ప్రధాని వాజ్ పేయి గురించి మాట్లాడారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *