Nara Lokesh

Nara Lokesh: మంగళగిరిని దేశంలోనే నంబర్ వన్ చేస్తా.. పవన్ కల్యాణ్ నాకు అన్న లాంటివారు.. !

Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తన ప్రధాన లక్ష్యమని ఏపీ విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో మంగళవారం (జూలై 21, 2026) నిర్వహించిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. నియోజకవర్గానికి చెందిన 3,000 మంది నిరుపేద కుటుంబాలకు లోకేశ్ చేతుల మీదుగా ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు

1. రూ.1000 కోట్ల ఆస్తి.. పేదలకు శాశ్వత భూహక్కు!

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిరుపేదల కోసం సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూమిని ఇళ్ల పట్టాల రూపంలో ప్రభుత్వ ఉచితంగా అందించిందని లోకేశ్ వెల్లడించారు.

తాము ఇస్తున్న ఈ శాశ్వత భూపట్టాల వల్ల పేదల ఆస్తులకు పూర్తి రక్షణ ఉంటుందని, భవిష్యత్తులో వీరి భూమిని ఎవరూ కదిలించలేరని హామీ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు తనతో పాటు చంద్రబాబును కూడా కొందరు అవహేళన చేశారని గుర్తుచేసుకున్న లోకేశ్.. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానని తెలిపారు.

2. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాకు అన్న లాంటివారు

సభ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు:

గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన అత్యంత కష్ట సమయంలో పవన్ కల్యాణ్ తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచారని, ఏ కష్టమొచ్చినా ‘నేనున్నానంటూ’ ధైర్యాన్ని ఇచ్చారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ సమావేశాల్లో ఇద్దరం ఎంతో ఆప్యాయంగా ఉంటామని చెప్పారు. “మంగళగిరికి అన్ని నిధులు నువ్వే పట్టుకెళ్తున్నావా?” అని పవన్ కల్యాణ్ తమాషాగా నవ్వేవారని సభాముఖంగా పంచుకున్నారు.

3. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జోడెద్దుల్లా పాలన!

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో ఆదాయం ₹1 ఉంటే, ఖర్చు ₹1.60 పైసలుగా ఉండేదని.. రెండేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఆ ఖర్చును ₹1.40 పైసలకు తగ్గించామని లోకేశ్ వివరించారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లలా (జోడెద్దుల్లా) ముందుకు తీసుకెళ్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *