Court

Court: నాని సినిమాకి అదిరిపోయే ఓటిటి డీల్!

Court: న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా కూడా సత్తా చాటుతున్నాడు. నాని(Nani) తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్లుగానే ఇదొక కోర్టు రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేశాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది.‘కోర్ట్’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.9 కోట్ల ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.9 కోట్లు అంటే, ఈ సినిమాకు నిజంగా సేఫ్ ప్రైజ్ అని చెప్పాలి.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: బుమ్రా ఔట్..! వరుణ్ ఇన్..! మరి ఛాంపియన్స్ ట్రోఫీ పరిస్థితి ఏంటి?

ఈ సినిమా బడ్జెట్ కూడా కేవలం రూ.9 కోట్ల లోపే ఉండడం విశేషం. దీంతో ఓటీటీ రైట్స్‌తోనే నాని సేఫ్ అయ్యాడని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కూడా నానికి లాభాలను తెచ్చిపెట్టనున్నాయని తెలుస్తుంది. ఈ మూవీని మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  2025 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు రెడీ!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *