Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయనే చెప్పాలి. పుష్ప 2 విజయం బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపిందనే చెప్పాలి. అయితే పుష్ప 2 ప్రమోషన్స్ టైంలో అల్లు అర్జున్ కొన్ని ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే.అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా బన్నీ ఇక నుంచి రాబోయే ప్రాజెక్టులు, ఇతర విషయాలకు సంబంధించి నేరుగా ఓ స్పోక్స్‌పర్సన్ ద్వారా వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఓ స్పోక్స్‌పర్సన్‌ను బన్నీ అప్పాయింట్ చేయనున్నారని.. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ స్పోక్స్ పర్సన్ మాత్రమే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.ఇలా ఓ స్టార్ హీరో స్పోక్స్ పర్సన్‌ను పెట్టుకోవడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.
