The Paradise

The Paradise: ప్యారడైజ్ అనేది వయోలెన్స్.. తల్లీకొడుకుల ఎమోషనల్ కథ

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ  యూనిట్ తొలిసారి మీడియా ముందుకు వచ్చి సినిమా కథ, ట్రైలర్ రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు, రన్‌టైమ్‌పై పూర్తి వంటి వివరాలపైనా  పూర్తి క్లారీటీ ఇచ్చారు.

ట్రైలర్ రిలీజ్ లేదు – నాని క్లారిటీ..

గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ది ప్యారడైజ్’ సినిమాకి ఎలాంటి ట్రైలర్ ఉండబోదని నాని, శ్రీకాంత్ ఓదెల అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 24న సినిమాను ఆన్‌టైమ్‌లో తీసుకురావడానికి యూనిట్ రాత్రింబవళ్లు పనిచేస్తోందని, ట్రైలర్ కట్ చేయడానికి కనీశం 4రోజులు టైమ్ కేటాయించాలి ఆలా చెయ్యడం వల్ల సినిమా అవుట్ ఫుట్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రైలర్ లేకుండా(చూడకుండా ) థియేటర్ లోనే డైరెక్ట్ గా సినిమా చుస్తే ఒక్క కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పారు నాని.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఇలాంటి భావోద్వేగ కథకు ట్రైలర్ లేకపోవడమే మంచిదని, ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేదా ముందస్తు ఆలోచనలు లేకుండా నేరుగా చూస్తేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.
అసలు కథేంటి? – శ్రీకాంత్ ఓదెల రివీల్..
‘ది ప్యారడైజ్’ కేవలం రక్తపాతం, యాక్షన్ మాత్రమే కాదని దర్శకుడు స్పష్టం చేశారు. ఇది ప్రధానంగా ఒక తల్లి, కొడుకు మధ్య సాగే ఎమోషనల్ జర్నీ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినా.. సొంత గడ్డపై గుర్తింపు దక్కక అణచివేతకు గురైన ఒక వర్గం ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని ఈ సినిమాలో చూపియ్యబోతున్నారు.టీజర్ చూసి సినిమా అంతా తీవ్ర హింస ఉంటుందని భావిస్తున్నారని, కానీ ఆ హింస వెనుక కదిలించే బలమైన ఎమోషన్ ఉంటుందని నాని స్పష్టం చేశారు.
రాజమౌళి వద్దకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్తా!..
సినిమా షూటింగ్ ఆలస్యం కావడంపై శ్రీకాంత్ ఓదెల పశ్చాత్తాపం వ్యక్తం చేశారని నాని గుర్తు చేసుకున్నారు. “సమయపాలన (Time Management) విషయంలో నేను విఫలమయ్యాను. రాజమౌళి గారి దగ్గరకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకుంటాను” అని శ్రీకాంత్ తనతో చెప్పినట్లు నాని వెల్లడించారు. తన తప్పును తెలుసుకుని నేర్చుకోవాలనుకునే ఆ తత్వం తనకు ఎంతో గర్వాన్ని కలిగించిందన్నారు.
మోహన్ బాబు పాత్ర – తెలంగాణ నేటివిటీ..
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆయన గురించి బయట ఎన్నో పుకార్లు ఉంటాయి. కానీ ఆయనతో కలిసి ప్రయాణిస్తే ఎవరైనా ప్రేమలో పడతారు. ఆయన మనసు చిన్నపిల్లాడి లాంటిది” అని నాని కొనియాడారు. తెలంగాణ నేటివిటీని ప్రతిబింబిస్తూ ‘జడలు’ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడం డాన్సుల కంటే ఎంతో సవాలుగా అనిపించిందని తెలిపారు.

 

ది ప్యారడైజ్’ తుది రన్‌టైమ్‌ను 2 గంటల 49 నిమిషాలుగా (169 నిమిషాలు) లాక్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకాంత్ రా ఎమోషన్స్, నాని సరికొత్త అల్ట్రా మాస్ రోల్ వెరసి సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *