Nani: నేచురల్ స్టార్ నాని, సుజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరి కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 జూన్ నుండి ప్రారంభం కానుంది. సుజిత్ ఇప్పటికే ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, నానిని ఎన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖరారైంది. వీరిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Mrunal Thakur: మాజీ ప్రేమికుడ్ని వదిలేశాను.. కారణం ఇదే – మృణాల్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తి కాగానే నాని-సుజిత్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
