SSMB29: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29పై సినీ ప్రియులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్‌తో పాటు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌ను కీలక పాత్ర కోసం రాజమౌళి టీమ్ సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఆ పాత్ర తనకు సరిపడలేదని భావించిన నానా ఈ ఆఫర్‌ను వినయంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు నటిస్తున్నారని సమాచారం. రాజమౌళి మార్క్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరి, నానా స్థానంలో ఎవరు ఆ పాత్రలో కనిపిస్తారన్న చర్చ సినీ లోకంలో సాగుతోంది.

