Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ‘గుణ 369’తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ను భారీ ధరకు దక్కించుకుని, నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించిన ఈ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్ర సంభాషణలు రాశారు. తాజాగా ఈ సినిమా నుండి ‘నమో ఈశ్వర…’ అనే లిరికల్ వీడియో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో దీనికి స్వరాలు సమకూర్చగా, శ్రీనివాస మౌళీ దీని రచన చేశారు. స్వరాగ్ కీర్తన్ అద్భుతంగా ఆలపించారు.
 
							
