King 100

King 100: డబ్బులు లేకపోతే loser అన్నారు.. కానీ ఇప్పుడు కింగ్ అంటున్నారు..!

King 100: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా సందడి మొదలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకను ఇస్తూ.. ఈ ల్యాండ్‌మార్క్ మూవీ టైటిల్ ఇంకా ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ టీమ్.. అధికారికంగా విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉన్నట్లే ఈ సినిమాకు ‘కింగ్ 100’ (King 100) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం స్వయంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.

మనుషుల్లో రెండు రకాలు.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్

విడుదలైన కొద్ది సెకన్ల గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది..
గ్లింప్స్  స్టార్టింగ్ లోనే పవర్ ఫుల్ డైలాగ్ “మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు” అంటూ నాగార్జున చెప్పే ఇంటెన్స్ వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది.
కథా నేపథ్యం: ఏమీ లేని ఒక పేదవాడు కసితో పైకి ఎదిగి, నేర సామ్రాజ్యంలో చక్రం తిప్పుతూ ‘కింగ్’ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నట్లు స్పష్టమవుతోంది.
యంగ్ లుక్ & ఫాదర్ ఎమోషన్: సినిమాలో బలమైన తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో పాటు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లలో నాగార్జున సరికొత్త యంగ్ లుక్‌లో కనిపించి అలరించనున్నారు.

క్రేజీ కాంబినేషన్ – మళ్లీ వెండితెరపై నాగ్-టబు మ్యాజిక్:

హిట్ పెయిర్ రీ-యూనియన్: గతంలో ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలతో వెండితెరపై మాయ చేసిన నాగార్జున-టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతోంది.

కీలక పాత్రలో టబు: ఈ సినిమాలో టబు కేవలం అతిథిగా కాకుండా కథను మలుపు తిప్పే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.

రాక్ స్టార్ సంగీతం – డిసెంబర్ 24న థియేటర్లలోకి:

‘నితమ్ ఒరు వానమ్’ (ఆకాశం) ఫేమ్ రా కార్తీక్ ఈసారి భావోద్వేగాలు, యాక్షన్, మిస్టరీ అంశాల కలయికతో పక్కా కమర్షియల్ వినోదాన్ని సిద్ధం చేశారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అక్కినేని అభిమానుల భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ల్యాండ్‌మార్క్ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

‘కింగ్’ గ్లింప్స్ ని ఇక్కడ చూడొచ్చు.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *