Pet Dog Care

Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!

Pet Dog Care: పెంచుకునే కుక్క (డాగ్) కేవలం ఒక జంతువు మాత్రమే కాదు.. మన ఇంట్లోని ఒక చిన్న బిడ్డ లాంటిది. దాన్ని మనం మన కుటుంబంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తూ ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అలాంటి పరిస్థితిలో, పెంపుడు కుక్కకు వచ్చే ప్రతి చిన్న ఆరోగ్య సమస్య మనల్ని ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, చాలాసార్లు మన డాగ్ కేర్ తీసుకునేటప్పుడు వాటిలో వచ్చే కొన్ని శారీరక, ప్రవర్తనా మార్పులను మనం సాధారణ విషయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటాం.

నిజానికి, కుక్కలకు వయసు పెరుగుతున్న కొద్దీ వాటి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. సాధారణంగా 5 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాలా కుక్కలలో వృద్ధాప్యానికి సంబంధించిన ప్రారంభ సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సమయానికి గుర్తించకపోతే అవి ‘ఆర్థరైటిస్’ (కీళ్ల నొప్పుల వ్యాధి) వంటి పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

డాగ్స్ జాయింట్ హెల్త్‌పై నిపుణులు ఏమంటున్నారు?

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ పశువైద్యుడు (వెటర్నరీ డాక్టర్), యానిమల్ హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ ఆమిర్ అన్వరీ.. సోషల్ మీడియాలో ‘ఆమిర్ ద వెట్’ (Amir The Vet) అనే పేరుతో పెంపుడు జంతువుల ప్రేమికులకు బాగా సుపరిచితులు. ఈ రోజుల్లో కుక్కలలో వయసు పెరగడం వల్ల వచ్చే కీళ్ల సమస్యలపై ఆయన ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. సరైన సంరక్షణ, కొన్ని ముఖ్యమైన అలవాట్లను చిన్నప్పటి నుంచే పాటించడం ద్వారా కుక్కల కీళ్ల ఆరోగ్యాన్ని (Joint Health) దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచవచ్చని ఆయన చెబుతున్నారు. కుక్కలను ఆర్థరైటిస్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఆయన సూచించిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇక్కడ చూద్దాం..

1. కుక్కల బరువును అదుపులో ఉంచండి (Weight Control)

వయసు పెరుగుతున్న కొద్దీ కుక్కల కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి వాటి బరువును అదుపులో ఉంచడం అన్నింటికంటే చాలా కీలకమని డాక్టర్ ఆమిర్ అన్వరీ చెబుతున్నారు. ఎందుకంటే డాగ్ కాస్త ఓవర్‌వైట్ (అధిక బరువు) అయినా సరే, దాని కీళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల వయసుతో పాటు కీళ్లు చాలా వేగంగా అరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి ఇచ్చే ఆహారం విషయంలో బ్యాలెన్స్ పాటించాలి.

2. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చాలా అవసరం (Regular Exercise)

కుక్కల కీళ్ల ఆరోగ్యానికి క్రమంతప్పకుండా ఇంకా సమతుల్యంగా చేసే వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. అందుకోసం ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో తేలికపాటి వాకింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ‘లో-ఇంపాక్ట్ యాక్టివిటీస్’ (తక్కువ శ్రమతో కూడిన పనులు) చేయించాలి. ఇవి వాటి శరీరాన్ని ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా, కీళ్లను కూడా బలంగా మారుస్తాయి.

3. ఇంటి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు (Home Environment Modifications)

కుక్కల జాయింట్ హెల్త్‌ను కాపాడటానికి ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా ఎంతగానో సహాయపడతాయి. మన ఇళ్లలో ఉండే జారే గుణం ఉన్న టైల్స్ లేదా నునుపైన మార్బుల్ ఫ్లోరింగ్‌పై కుక్కలు నడిచేటప్పుడు జారిపడే ప్రమాదం ఎక్కువ. ఇలా తరచూ జారడం వల్ల వాటి కీళ్లపై అదనపు లోడ్ పడుతుంది. కాబట్టి, అవి ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో కార్పెట్లు లేదా రగ్గులు పరచడం మంచిది. దీనివల్ల అవి నడిచేటప్పుడు కాళ్లకు మంచి గ్రిప్ లభిస్తుంది.

4. జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ (Nutritional Support)

కుక్కలలో ఏదైనా కీళ్ల సమస్య లేదా నొప్పులు బయటపడకముందు నుంచే వాటికి ‘జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్’ ఇవ్వడం ప్రారంభించాలని డాక్టర్ ఆమిర్ అభిప్రాయపడ్డారు. అంటే, ఈ న్యూట్రీషియన్లను వ్యాధి వచ్చిన తర్వాత చికిత్సలా కాకుండా, అసలు రాకుండా చూసుకునే ఒక నివారణోపాయంగా ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం వెటర్నరీ డాక్టర్ సలహాతో ‘ఒమేగా-3 సప్లిమెంట్స్’, ‘జాయింట్ సపోర్ట్ ఫార్ములా’ల కాంబినేషన్‌ను కుక్కల డైట్‌లో చేర్చడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *