Mysterious Disease: అంతు చిక్కని వ్యాధితో ఆ ఊరిలో జనం వరుసగా చనిపోతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆ ఊరు వెళ్లి పరిశీలించారు. అధికారులు అక్కడే మకాం వేసి పరిశోధనలు చేశారు. కానీ.. మరణాలు ఆగలేదు. కారణాలు తెలియలేదు. దీంతో ప్రస్తుతం ఆ ఊరు మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలోని బాదల్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చారు. ఇక్కడ 44 రోజుల్లో 3 కుటుంబాలకు చెందిన 17 మంది మర్మమైన వ్యాధితో మరణించడంతో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ గుంపులుగా తిరగడం నిషేధం.
బుధవారం ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆరోగ్యం క్షీణించింది. 16 – 22 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇద్దరు రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లో చేరారు. మంగళవారం తెల్లవారుజామున 25 ఏళ్ల యువకుడు ఎజాజ్ అహ్మద్ ఆరోగ్యం క్షీణించింది. అంతకుముందు అతన్ని జిఎంసి జమ్మూకు తీసుకువచ్చారు. తర్వాత పీజీఐ చండీగఢ్‌కు రెఫర్ చేశారు.
ఇది కూడా చదవండి: Boiled Peanuts: ఉడికించిన వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Mysterious Disease: డిసెంబర్ 7 నుంచి జనవరి 19 మధ్య గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ మరణాలకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు, మంగళవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనిఖీ కోసం గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా చేయాలని పాలకులు నిర్ణయించారు.
ఈ వ్యాధిని కేంద్ర బృందం పరిశీలిస్తోంది. ఈ మరణాలకు కారణం అంటువ్యాధుల వల్ల కాదని ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందని విచారణలో పాల్గొన్న జీఎంసీ రాజౌరి చీఫ్ షుజా ఖాద్రీ తెలిపారు. ఆహార పదార్థాల్లో ఏదైనా విషపూరితం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి బృందం 200 కంటే ఎక్కువ ఆహార పదార్థాల నమూనాలను వివిధ సంస్థలకు పంపింది.